శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండు నౌకలు హైజాక్‌.. 22మంది భారతీయ సిబ్బంది

58 నిమిషాల క్రితం

Two vessels
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆడెన్‌ : యెమెన్‌, సోమాలియా తీర ప్రాంతాల్లో రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు అపహరించారు. ఈ రెండు నౌకల్లో మొత్తం 22 మంది భారతీయులు ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. యెమెన్‌ తీరానికి సుమారు 30 నాటికల్‌ మైళ్ల దూరంలోని ఏడెన్‌ గల్ఫ్‌లో గురువారం ఒక చమురు ట్యాంకర్‌ను దుండగులు స్వాధీనం చేసుకున్నారు. ఎరిట్రియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా, వారిలో 16 మంది భారతీయులు ఉన్నారు. అలాగే, ఆగస్టు 17న సోమాలియాలోని పుంట్‌లాండ్‌ తీరం సమీపంలో మరో కార్గో నౌకను సముద్రపు దొంగలు అపహరించారు. కామెరూన్‌ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు.

ఈ నౌక టర్కీకి చెందిన ఆయుధాలు, సమాచార వ్యవస్థకు సంబంధించిన పరికరాలు, ఉపగ్రహ పరికరాలను మొగడిషూలోని టర్కీ సైనిక శిక్షణా కేంద్రానికి తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఆరుగురు భారతీయులతో పాటు ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియన్‌, ఇద్దరు సెర్బియన్‌ భద్రతా సిబ్బంది ఉన్నారని చెప్పారు. నౌకను సముద్రపు దొంగలు పుంట్‌లాండ్‌లోని నుగాల్‌ తీరం వైపు తీసుకెళ్లినట్లు సమాచారం. గతంలో ఎం/వి స్వార్డ్‌ అనే నౌకను అపహరించిన ముఠాకు చెందినవారే ఈ ఘటనలో కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అపహరణకు గురైన నౌక సమీపంలోకి టర్కీకి చెందిన నౌకలు, హెలికాప్టర్లు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అనంతరం జరిగిన వైమానిక దాడిలో నలుగురు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. అయితే, మృతులకు నౌక అపహరణతో సంబంధం ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అపహరణకు గురైన నౌకలు, వాటిలోని సిబ్బంది, సరుకు పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై టర్కీ అధికారులు వెంటనే స్పందించలేదు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్