మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చీరాల కౌంటింగ్‌ వాయిదా..

1 గంట క్రితం

chirala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 12:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 6న ఓట్ల లెక్కింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ​: మురసు తుపాను, భారీ వర్షాలు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల నేపథ్యంలో చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించాలని ఆదేశించింది. చీరాల కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో వరద నీరు చేరడం, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్ల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని బాపట్ల జిల్లా కలెక్టరు.. ఎన్నికల సంఘానికి నివేదించారు. బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల పత్రాలు దెబ్బతినడంతోపాటు విద్యుత్‌, సమాచార వ్యవస్థలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని వివరించారు. కలెక్టరు విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం కౌంటింగ్‌ వాయిదాకు అనుమతించింది. కొత్త తేదీపై అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, మీడియాకు సమాచారం అందించి కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయాలని కలెక్టరును రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్