ప్రజాశక్తి - యద్దనపూడి : మండలంలోని జాగర్లమూడి గ్రామములోని ఉన్నత పాఠశాలలో ఐసిపిఎస్ డి.రాము సోషల్ వర్కర్, ఎస్ సరస్వతి సోషల్ వర్కర్ పిల్లలకు బాల్య వివాహాల గురించి, దాని వలన కలిగే నష్టాలు గురించి అవగాహన కల్పించారు. సంబంధిత చట్టాలు, హెల్ప్లైన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు. అనంతరం పోలూరు గ్రామములోని నందలి పర్చూరు శేషాద్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జాగర్లమూడి హై స్కూల్ హెచ్ఎం బి శ్రీనివాసరావు, పోలూరు హై స్కూల్ హెచ్.ఎం వి. పద్మజ, ఉపాధ్యాయురాలు హెచ్.పుష్పలత, జాగర్లమూడి గ్రామములోని అంగన్వాడి కార్యకర్తలు పి నాగరాజ ,టి త్రివేణి, ఎల్ సుజాతమ్మ, పోలూరు గ్రామములోని అంగన్వాడీ కార్యకర్తలు సి.హెచ్ జోస్నా, జీ సౌభాగ్యవతి, వి సురేంద్ర దేవి పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
11 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)