ప్రజాశక్తి - యద్దనపూడి : మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మంగళవారం విద్యార్థులకు బాపట్ల సబ్ డివిజన్ శక్తి టీమ్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా యద్దనపూడి రత్న కుమారి మాట్లాడుతూ .. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి అన్నారు. విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకొని ఉన్నతంగా ఎదగాలి అన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవేంద్రరావు అధ్యక్షత వహించారు. శక్తి టీమ్ సభ్యురాలు రేవతి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్ బాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అత్యవసర సమాయాల్లో 112 కి ఫోన్ చేసి సహాయం పొందాలని చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధిచి 1930 ఫోన్ కు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చట్టాలపై విద్యార్థులకు అవగాహన
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)