మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపాన్ ప్రభావిత కాలనీల్లో రక్షణ చర్యలు చేపట్టాలి : సిపిఎం

1 గంట క్రితం

vza
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణంలో తుపాన్ ప్రభావిత కాలనీల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏ. జగన్ మోహన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం గాజుల రేగ ఎస్సీ కాలనీ, చిన గోకపేట లో పర్యటించి శిథిలమైన , పెచ్చులు ఊడిపోతున్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు కారిపోతున్నాయని, చంటి పిల్లలుతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి పట్టణం లో తుపాన్ ప్రభావిత కాలనీల్లో శిధిలమైన ఇళ్లను గుర్తించి వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని కోరారు. వర్షపు నీటితో పాఠశాలల ఆవరణ లు నిండిపోయి పిల్లులు ఇబ్బంది పడుతున్నారని, కొన్ని చోట్ల తరగతి గదులు రిపేర్లు చేయాల్సి వుందని అన్నారు. ఆయనతో పాటు స్థానికులు నాగరాజు, రామరాజు, ఆదినారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్