శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

7 వ రోజుకు చేరిన రైతుల నిరాహార దీక్షలు

1 గంట క్రితం

Farmers' hunger strikes enter the 7th day.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 04:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

.. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని రైతుల డిమాండ్.

.. భూ సేకరణకు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు నిరసనలు కొనసాగుతాయి.


ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : గుంటూరు ఛానల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేసి కాల్వ పనులు ప్రారంభించాలని నల్లమడ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ... రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ .... ఈ ప్రాంత ప్రజలు నీటి కోసం దశాబ్దాలుగా పోరాటాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప గుంటూరు ఛానల్ పొడిగింపుకు సంబంధించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అదిగో పొడిగిస్తాం ఇదిగో పొడిగిస్తామని ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. నల్లమడ ప్రాంత రైతులకు ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరారు. అందుకు ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ద్వారా నల్లమడ ప్రాంత రైతాంగానికి ఆరుతడులకు సాగునీరు అందుతుందని చెప్పారు. గ్రామాలకు తాగునీరు అందుతుందని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నా గుంటూరు ఛానెల్ పర్చూరు వరకు పొడిగించి వారి కల సహకారం చేయాలని కోరారు. పర్చూరు ప్రాంతంలో భూ సేకరణకు గజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. ఈనెల 24న మండల కేంద్రమైన పర్చూరులో నిర్వహించే బందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రిలేదీక్షలో నలమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, తోకల కృష్ణమోహన్, దేవరపల్లి గ్రామానికి చెందిన 26 మంది రైతులు, నల్ల మడ ప్రాంత రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్