శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్ ముందు నాలుగు రోజులుగా మృతుడు తౌశిక్ (విద్యార్థి) తల్లి మౌలాబి న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. తమ కుమారుడు మృతికి న్యాయం జరగాలంటూ నాలుగు రోజులుగా స్కూలు ముందు తల్లి మౌలాబి న్యాయపోరాటం చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు చనిపోయిన స్కూల్ హాస్టల్ లో యాజమాన్యం "హాస్టల్ పర్మిషన్లు" లేకుండా 120 మందికి పైగా విద్యార్థులను ఉంచి విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్నారని తన బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఏ బిడ్డకు జరగకూడదని అనుమతులు లేని హాస్టల్ ను వెంటనే మూసివేయాలని కోరారు. అందుకు విద్యాశాఖ అధికారులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ఒత్తిడితో శాంతియుతంగా పోరాటం చేస్తున్న తనపై పోలీసులు సైతం కేసులు పెట్టాలని చూస్తున్నారని, తనపై ఎన్ని కేసులు పెట్టినా తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తూనే ఉంటానని అప్పటివరకు స్కూల్ ముందు నుండి లేచేది లేదని మౌలాభి స్పష్టం చేశారు.
4 వ రోజు - స్కూలు ముందు తల్లి న్యాయపోరాటం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)