బాపట్ల : మురుసు తుఫాన్ ముంపు ప్రాంతాల్లో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. మురుసు తుఫాన్ ప్రభావంతో బాపట్ల మండలం జిల్లెలమూడి వద్ద నల్లమడ డ్రైన్‌కు గండిపడి, దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిఎం నేడు ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బాపట్ల ఎమ్మెల్యే వేగశన నరేంద్ర వర్మ రాజు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జిల్లెలమూడి నల్లమడ డ్రైన్ (వంతెన) ప్రాంతాన్ని సందర్శించి, స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ కారణంగా నల్లమడ డ్రైన్ పొంగిపర్లడం, కాలువ కట్టలు తెగి వరి పొలాల్లోకి భారీగా వరద నీరు చేరిన వైనాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సిఎం పర్యటన వేళ .. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 11:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)