శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చీరాలలో మందకొడిగా కౌంటింగ్‌.. ఫలితాలకు రాత్రి 8 గంటలు!

4 గంటల క్రితం

chirala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 04:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

* రాత్రి 8 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం: ఆర్డీఓ నరసింహారావు

* సెగ్మెంట్‌ విధానంలో పీఎస్‌ల వారీగా ఓట్ల లెక్కింపు

* చీరాల, వేటపాలెంలో 44 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

* ఫలితాల కోసం అభ్యర్థులు, అనుచరుల ఉత్కంఠభరిత నిరీక్షణ


ప్రజాశక్తి - చీరాల: చీరాల, వేటపాలెం మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నత్తనడాకన మందకొడిగా సాగుతోంది. ఫలితాల అధికారికంగా వెల్లడికి రాత్రి 8 గంటలు పడుతుందని ఆర్డీఓ నరసింహారావు తెలిపారు. సెగ్మెంట్‌ విధానంలో పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఓట్లను లెక్కిస్తుండటంతో జాప్యం జరుగుతోంది.చీరాల మండలంలో 24 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, వేటపాలెం మండలంలో 18 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క స్థానం కూడా పూర్తికాకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.మరోవైపు అనుచరులు కౌంటింగ్‌ కేంద్రం వెలుపల రోడ్లపై, చెట్ల నీడలో గంటల తరబడి పడిగాపులు కాస్తూ అన్న పానీయాలు లేకుండా తమ పార్టీ అభ్యర్థుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే అభ్యర్థులులో లెక్కింపు జాప్యంతో టెన్షన్ వాతావరణం నెలకోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్