గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

3 గంటల క్రితం

Tension at the Kothapeta polling station
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 02:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- బ్యాలెట్ పత్రాలు మారాయంటూ అభ్యర్థుల ఆందోళన

-అధికారులను నిలదీసిన అభ్యర్థులు

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : కొత్తపేట పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ పత్రాల మార్పుపై అభ్యర్థుల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదటి పోలింగ్ బూత్‌కు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు రెండో పోలింగ్ బూత్‌లోకి ఎలా వచ్చాయంటూ అభ్యర్థులు ఎన్నికల అధికారులను నిలదీశారు. బ్యాలెట్ పత్రాలు మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అసలు బ్యాలెట్ పత్రాలు ఎలా మారాయి ? ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి ? ఈ పరిణామం పోలింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపింది ? అన్న అంశాలపై అక్కడ చర్చ జరుగుతోంది. అధికారులు చేపట్టే విచారణపై అభ్యర్థులు, ఓటర్లలో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు ఎన్నికల అధికారులు వచ్చాక తెలియాల్సి ఉంది.
Tension at the Kothapeta polling station


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్