శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి 46వ వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

1 గంట క్రితం

prajasakti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 09:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చీరాల: ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజాశక్తి కీలక పాత్ర పోషిస్తోందని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. శనివారం టిడిపి కార్యాలయం వద్ద ప్రజాశక్తి 46వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాశక్తి ప్రతినిధులు, సిబ్బందిని అభినందించారు. రానున్న రోజుల్లో ప్రజాశక్తి మరింత అభివృద్ధి చెంది ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్య్రకమంలో డివిజన్ ఇన్‌చార్జి సురేష్, రిపోర్టర్ బెజ్జం మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్