శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

SL vs IND: టాస్‌ నెగ్గిన భారత్‌.. తొలుత బ్యాటింగ్‌

1 గంట క్రితం

india-vs-srilanka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 09:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. "మేం ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు. 

శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా మాట్లాడుతూ.. "టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లం. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నాం. ఇది ఒక చారిత్రక మైదానం. ఇలాంటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నాడు. భారత్‌కు ఇది 600వ టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం.

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్(సి), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
శ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(సి), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(w), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్