రాయపూడిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి: రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వర్ణాంధ్ర 2047 థీమ్‌తో ప్రభుత్వం ఈ వేడకలు నిర్వహిస్తోంది. కార్యక్రమంలో గవర్నర్, న్యాయమూర్తులు, మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. మంత్రి నారోలోకేష్ విజయవాడలో జెండాను ఎగరవేశారు.







కామెంట్‌లు (0)