ప్రజాశక్తి-మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్ సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన యువ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. వైఎస్సార్ ఫిషర్‌మెన్ కాలనీకి చెందిన పల్లెటి రాజు (25) శనివారం తెల్లవారుజామున వేటకు వెళ్లాడు. సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో పాటు, అలల ఉద్ధృతికి బోటు తీవ్రంగా ఊగిపోయింది. దీంతో రాజు అదుపుతప్పి సముద్రంలో పడిపోయి గల్లంతైనట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు గల్లంతైన రాజు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 10:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)