శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిత్తూరు ఎన్నికల్లో కలెక్టర్ సంచలనాత్మక నిర్ణయం

20 అక్టోబర్, 2026

Collector's sensational decision in Chittoor elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిత్తూరు : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ కేంద్రాలన్నీ కూడా చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. నామినేషన్లను భారీ పోలీసు భద్రత నడుమ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించడానికి సిద్ధం చేశారు. ఇక అభ్యర్థులు, ప్రతిపాదకులు నేరుగా వచ్చి కలెక్టర్ ఎదుట సంతకం పెడితేనే నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. మొత్తం ప్రక్రియను కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చొని కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్