- ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి
ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరులో బస్టాండ్ కూడలివద్ద చర్చి ఎదురుగా స్థానిక యువ శాస్త్రవేత్త పవన్ ఏర్పాటు చేసిన ఉచిత సోలార్ మొబైల్ ఛార్జింగ్ యూనిట్ ను పలమనేరు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మొబైల్ చేయడానికి వీలుకాక ముఖ్యమైనటువంటి కాల్ చేసుకోవడానికి వీలు పడకుండా ఇబ్బంది పడేటువంటి మొబైల్ వాడకం దారులకు, దూర ప్రయాణికులకు ఈ మొబైల్ ఛార్జింగ్ యూనిట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏకకాలంలో 9 రకాలైనటువంటి మొబైల్ లను చార్జింగ్ చేసుకొని సౌలభ్యం ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఈ సోలార్ మొబైల్ ఛార్జింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసిన యువ శాస్త్రవేత్త పవన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాజన్న బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షుడు ఆర్ వి బాలాజీ మాజీ కౌన్సిలర్లు బిఆర్సి కుమార్ కిరణ్ రాయల్ సింగిల్ విండో చైర్మన్ లో వెంకటరమణ రెడ్డి వెంకటరమణ టిడిపి, బిజెపి,జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)