మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

28 జులై, 2026

Man attempts suicide while intoxicated
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వినుకొండ (గుంటూరు) : వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామానికి చెందిన వంకాయలపాటి కోటయ్య అనే యువకుడు మంగళవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన కోటయ్య నిత్యం మద్యం సేవించి భార్య పిల్లల్ని వేధిస్తూ ఉండేవాడని అత్త సీతారావమ్మ తెలిపారు. తనకున్న ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం తల్లికి వందనం 39000 జమ చేయగా తల్లి కోటమ్మ పిల్లల చదువు కోసం నగదు మొత్తాన్ని డ్రా చేసి బీరువాలో భద్రపరచగా ఎవరికి తెలియకుండా కోటయ్య బీరువాలో డబ్బు తీసుకొని మందు తాగి కాజేసాడని, పిల్లల నోటి దగ్గర డబ్బులు మందుకు ఆగం చేశాడని భార్య నిలదీయడంతో గొడవ పడి, భార్యని కత్తితో చంపుతానని బెదిరించాడని అత్త సీతారావమ్మ వివరించారు. మంగళవారం ఉదయం మందు కోసం డబ్బు లేక కోట ఇంట్లో ఉన్న మోటార్ ను తీసుకువెళ్లి అమ్ముకొని మద్యం సేవించి ఇంటికి వస్తే పెట్రోల్ వెంట తెచ్చుకొని కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు ఆమె తెలిపారు. క్షతగాత్రుడు వినకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్