ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్‌ఐ) పల్నాడు జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) పల్నాడు జిల్లా అధ్యక్షులు సలీం పిలుపునిచ్చారు. ఆగస్టు 1 న సత్తెనపల్లిలో నిర్వహించనున్న డివైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా మహాసభల పోస్టర్‌ను నరసరావుపేట లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ యువజన సమస్యలు, నిరుద్యోగం, మాదకద్రవ్యాల వినియోగం వంటి ప్రజా సమస్యలపై డివైఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఆంజనేయ రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కోట సాయి కుమార్, పిడుగురాళ్ల మండల కార్యదర్శి రోహిత్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
డివైఎఫ్‌ఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి : ఐలు పల్నాడు జిల్లా అధ్యక్షులు బి.సలీం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 02:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)