మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పూరీ గుడిసెపై దూసుకెళ్లిన లారీ

47 నిమిషాల క్రితం

Lorry rams into thatched hut
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 02:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రూ.75 వేలకు పైగా ఆస్తినష్టం.. తప్పిన పెను ప్రమాదం


ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని దేవదొడ్డి పంచాయతీ పరిధిలోని కైగల్ దుముకురాళ్ల జలపాతం సమీపంలో కుప్పం–పలమనేరు మార్గంలోని ఎన్‌హెచ్‌4 జాతీయ రహదారిపై సోమవారం రాత్రి లారీ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పం నుంచి విశాఖపట్నం పోర్టుకు సరుకును తరలిస్తున్న లారీ మలుపు వద్ద అదుపుతప్పి ఈ ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. లారీ గుడిసెపైకి దూసుకెళ్లడంతో గుడిసె పూర్తిగా దెబ్బతిని రూ.75 వేలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెలో ఎవరైనా ఉండి ఉంటే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్