సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కుప్పం కోర్టుకు ఎమ్మెల్యే అమర్, టిడిపి శ్రేణులు హాజరు

1 గంట క్రితం

MLA Amar and TDP cadres appear before the Kuppam court.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : వైసిపి హయాంలో బనాయించిన ఓ కేసుకు సంబంధించి కుప్పం అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో పాటు కుప్పం టిడిపి శ్రేణులు సోమవారం హాజరయ్యారు. గత ప్రభుత్వంలో 2021 ఏడాది శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైతుల శ్రేయస్సు కోసం నిర్వహించిన ర్యాలీకి సంబంధించి అప్పటి చెంగుబల్ల వీఆర్వో రామిరెడ్డి ఫిర్యాదు మేరకు (క్రైమ్ నెం.191/2021) రాళ్ళ బుదుగూరు పోలీస్ స్టేషన్ లో 28 మందిపై అక్రమంగా కేసు నమోదైంది. ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా అక్రమ సమూహముగా ఏర్పడి అకస్మాత్తుగా రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని నినాదాలు చేస్తూ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా ఆపివేసి జాతీయ రహదారిని దిగ్బంధించారని ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై వాహనములను ఆపి ప్రజా రవాణాకు ప్రజాశాంతికి భంగము కలిగించారని, దాంతోపాటు బలవంతంగా పండ్లు కూరగాయల దుకాణాలను మూయించి కరోనా నిబంధనలను ఉల్లంఘించి వ్యాధి వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తించారని కేసు పెట్టడమైంది. ఈ కేసులో ఏ-1 గా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఉండగా, సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పీ. మనోహర్, ప్రస్తుత ఆర్టీసీ రిజినల్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తో సహా 25 మంది మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులోని మరో ముగ్గురు మృతి చెందడంతో వారు మినహా మిగిలిన అందరూ కోర్టుకు హాజరుకావడం జరిగింది. ఈ నెల 17వ తేదికి కేసు వాయిదా వేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. దీంతో కుప్పం కోర్టు ఆవరణ పలమనేరు, కుప్పం నియోజకవర్గం టిడిపి శ్రేణులతో సందడిగా కనిపించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్