విజయనగరం : విజయనగరంలోని డీఎస్ఎ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జూలై 8, 9, 10 తేదీల్లో నిర్వహించిన విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026–27లో సీతం విద్యార్థి వై.జస్వంత్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి అండర్-19 బాలుర డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకుని విజేతగా నిలిచిన జస్వంత్ రెడ్డిని సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .... క్రీడల్లో విజయాలు సాధించాలంటే విద్యార్థుల క్రమశిక్షణ, అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ల మార్గదర్శకత్వం, క్రీడా సంఘాల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహం, పట్టుదలతో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి సీతం, విజయనగరం జిల్లాకు మరిన్ని విజయాలు, గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జస్వంత్ రెడ్డి సాధించిన ఈ విజయం పట్ల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
డీఎస్ఎ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో విజేతగా సీతం విద్యార్థి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 05:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)