మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.60 కోట్ల మౌలిక సదుపాయాల కల్పన పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు

1 గంట క్రితం

MLAs laid foundation stones for infrastructure development works worth ₹60 crore.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 02:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం


చిత్తూరు : చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 123 నగర/ పురపాలక సంఘాల్లో అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేయగా.. చిత్తూరులో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.60 కోట్ల హెచ్ఏఎం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ లు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హయాంలో పట్టణాలు, నగరాలను అభివృద్ధి దిశగా నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు వేల కోట్ల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. చిత్తూరు నగరాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనంతగా గడిచిన రెండున్నర సంవత్సరంలో నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం హెచ్ఏఎం నిధుల కింద రోడ్లు, వీధిలైట్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాల కోసం రూ.60 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు మొత్తం 404.42 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో 164.42 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉండగా.. మరో రెండు వందల నలభై కోట్ల అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు వచ్చినట్లు చెప్పారు. చిత్తూరు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.‌. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు ప్రచార ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత వైకాపా పాలనలో నగరాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున అబద్ధాలతో, తప్పుడు ఆరోపణలతో ప్రజల వద్దకు వస్తున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ మేయర్ అముద, తెదేపా నగర అధ్యక్షుడు వరుణ్ కుమార్, కూటమి నాయకులు రాజేష్ కుమార్ రెడ్డి, గోపాలకృష్ణ, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేష్ యాదవ్, పుష్ప, లీలావతి, క్లస్టర్, డివిజన్, బూత్, ఇన్చార్జులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్