బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ ఎం సి) ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

1 గంట క్రితం

chittoor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి, పలమనేరు : ఏపి సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు పలమనేరు మండల విద్యాశాఖ అధికారులు పి లీలారాణి, జి .సుజాత తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్

సెప్టెంబర్ 15: ఎన్నికల నోటిఫికేషన్

సెప్టెంబర్ 18: ఓటర్ల జాబితా ప్రదర్శన

సెప్టెంబర్ 25: అభ్యంతరాల స్వీకరణతో పాటు తుది జాబితా ప్రకటన

సెప్టెంబర్ 29: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు

అదే రోజు మధ్యాహ్నం 1:30 కి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక2 గంటలకు ప్రమాణ స్వీకారం3 గంటలకు తొలి SMC సమావేశం

కొత్త మార్గదర్శకాలు : విద్యార్థుల సంఖ్యను బట్టి 12 నుంచి 25 మంది సభ్యులు ఉంటారు.75% మంది తల్లిదండ్రులు ఉండాలి.కనీసం 50% మహిళలు ఉండేలా కమిటీని ఏర్పాటు చేస్తారు.SC, ST, OBC, సిడ బ్ల్యూ, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇస్తారు.SMC పదవీకాలం 2 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్