శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కైలాసపురం పెద్ద స్మశానంలో నీటి సౌకర్యం కల్పించాలి

20 అక్టోబర్, 2026

cpi.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌. నాగరాజు డిమాండ్‌

ప్రజాశక్తి–చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు నగరంలోని కైలాసపురం పెద్ద స్మశానవాటికలో గత 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌. నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన నీటి సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నగర నడిబొడ్డున ఉన్న కైలాసపురం పెద్ద స్మశానవాటికకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మృతుల భౌతికకాయాలను తీసుకువస్తుంటారని తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో కాళ్లు, చేతులు కడుక్కొని ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, గత 20 రోజులుగా మోటారు మరమ్మతుల పేరుతో నీటి సరఫరా నిలిపివేయడంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యపై నగరపాలక సంస్థ కమిషనర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని నాగరాజు కోరారు. మోటారుకు మరమ్మతులు చేపట్టి స్మశానవాటికలో నిరంతర నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్