సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పత్తి పంటపై సందిగ్ధంలో రైతన్నలు

51 నిమిషాల క్రితం

rythusangam.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 10:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తాడిపత్రి(అనంతపురం): ఇటీవల కురిసిన వర్షాలతో తాడిపత్రి ప్రాంతంలోని పత్తి చేన్లు మళ్లీ పచ్చబడినప్పటికీ, పంట దిగుబడిపై రైతుల్లో ఆందోళన కొనసాగుతోందని ఏపీ రైతు సంఘం నాయకులు రాజారాం రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పత్తి పంట కీలక దశలో తేమ లేకపోవడంతో మొక్కల ఎదుగుదల ఆశించిన స్థాయిలో జరగలేదని తెలిపారు. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం కురిసిన వర్షాలతో మొక్కలు తిరిగి పచ్చబడుతున్నాయని చెప్పారు. అయితే మొక్కలు పచ్చబడినంత మాత్రాన ఆశించిన స్థాయిలో కాపు వస్తుందా, దిగుబడి లభిస్తుందా అనే సందేహం రైతుల్లో నెలకొందన్నారు. పత్తి పంట పరిస్థితిని వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రాజారాం రెడ్డి కోరారు. ప్రస్తుత పంటను కొనసాగించాలా, లేక తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలా అనే విషయంపై రైతులకు స్పష్టమైన సూచనలు, మార్గదర్శకాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్