ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : రాజమండ్రిలోని ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో B.Com. CA (సెక్షన్-I) చదువుతున్న విద్యార్థి సంతోష్ 09-08-2026న కరెంట్ షాక్ కారణంగా అకాల మరణం చెందడం కళాశాలలో తీవ్ర విషాదం నెలకొల్పింది. ఈ దుర్ఘటనతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతి, విచారానికి గురయ్యారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్.కె, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. పుత్రశోకంలో ఉన్న ఆ విద్యార్థి తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ కళాశాలలో అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
కరెంట్ షాక్ తో ఆర్ట్స్ కళాశాల విద్యార్థి మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)