ప్రజాశక్తి-చాగల్లు(తూర్పుగోదావరి) : ఈనెల 19 రాజమండ్రి జగద్గురు పీఠంలో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీలలో జడ్పీహెచ్ఎస్ చాగల్లు విద్యార్థులు పాల్గొని వివిధ కేటగిరీలో పది బంగారు పథకాలు గెలుచుకున్నారు. గెలుపొందిన వారిలో ప్రసన్న, మనోజ, హేమశ్రీ, సాయి శ్రీ, సుప్రజ, ధనరాజ్, పృద్వి, లక్ష్మి, బాలసుబ్రమణ్యం, జగదీష్లు ఉన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీ. వాసవి , విద్యార్థులకు శిక్షణ ఇచ్చినటువంటి జి. గణేష్ ని ఘనంగా సత్కరించారని వ్యాయామ ఉపాధ్యాయుని జె. విజయలక్ష్మి తెలిపారు, ఈ కార్యక్రమంలో మరొక వ్యామ ఉపాధ్యాయుని పోసి రత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులను గ్రామస్తులు పేరెంట్స్ కమిటీ చైర్మన్ నందిని అభినందించారు, గెలుపొందిన విద్యార్థులు త్వరలో చీరాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని విజయలక్ష్మి తెలిపారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చాగల్లు విద్యార్థులు
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)