బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాళ్ల పారాణి ఆరకముందే కాటేసిన మృత్యువు - ఇద్దరు యువకులు మృతి

1 గంట క్రితం

Death struck before the *paarani* (traditional red dye) on their feet could dry – two young men dead.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : కాళ్ల పారణి ఆరకముందే కొత్త పెండ్లికుమారుడు, మరో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటన పిట్టల వేమవరం మెయిన్ రోడ్డుపై జరిగింది. పిట్టల వేమవరం గ్రామానికి చెందిన నేలపూడి ప్రదీప్ (24) కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన మిత్రుడు హరిదాసు బాల సుబ్రహ్మణ్యం సాయి ( 21) ఇతను బెంగళూరు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. నేలపూడి ప్రదీప్ సింగపూర్ షిప్ యార్డ్ లో ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకోవడానికి ఇటీవల గ్రామానికి వచ్చాడు. ఐదు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయి పెరవలి దీపిక తో గత సోమవారం ఏసి కళ్యాణమండపం లో వివాహం ఘనంగా జరిగింది. ప్రదీప్ సోమవారం తన గ్రామం నుండి సాయంత్రం 7 గంటల సమయంలో 15 చిన్న కార్లపై ఊరేగింపుగా వెళుతూ మెయిన్ రోడ్డు పై ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద ఆగి భారీగా మందుగుడు కాల్చాడు. అనంతరం మంగళవారం అదే సమయానికి స్నేహితునితో మోటర్ బైక్ పై పనిమీద వెళుతూ ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొట్టి విద్యుత్ స్తంభం వైపు పడటంతో అదే వైఎస్ఆర్ విగ్రహం వద్ద మృత్యువాతపడ్డాడు. మెయిన్ రోడ్ సి సి రోడ్డు కావడంతో తరచూ ప్రమాదాల బారిన పడి పలువురు కాళ్లు చేతులు విరిగి మృత్యువాతపడుతున్నారని పలువురు చెబుతున్నారు. ముక్కామల-వడలి ఆర్ అండ్ బి రోడ్డు గ్రామాల్లో సిసి రోడ్డు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డు మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పలువురు అకాల మృత్యు బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద రోడ్డు వేసిన నాటి నుండి ఇప్పటివరకు ఎనిమిది మంది వరకు యాక్సిడెంట్లు కారణంగా కాళ్లు చేతులు విరిగినవారు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్