మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరటి పరిశోధన కేంద్రం లీజ్ భూములు పరిశీలించిన జిల్లా ఎండోమెంట్ అధికారి

1 గంట క్రితం

District Endowment Officer inspects leased lands of the Banana Research Station.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 02:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : కాకరపర్రు గ్రామంలో ఉన్న దేవస్థాన భూములను మంగళవారం పరిశీలించిన జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఇ.వి. వెంకట సుబ్బారావు. జాతీయ సహకార సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో అరటి పరిశోధనా కేంద్రం, అరటి విత్తన మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు చేయడానికి దేవస్థానం భూములను పరిశీలించేందుకు జిల్లా దేవదాయ శాఖ అధికారి ఇ.వి.వెంకట సుబ్బారావు ఇక్కడకు వచ్చారు. జిల్లాలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి సంకల్పించిన సహకార సంస్థ తగిన భూముల కోసం గత 6 నెలలుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో గల 30 ఎకరాల దేవస్థానం భూములను రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. గతంలో సహకార సంస్థ అధికారులు ఇక్కడకు వచ్చి ఈ భూములను పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం దేవస్థానం భూములు కౌవుల రైతుల ఆధీనంలో ఉన్నవి. మొత్తం భూమి మూడు సంవత్సరాల కాలపరిమితికి రైతులు పాడుకోగా కొన్ని భూములు ఇప్పటికే ఒక సంవత్సరం పూర్తిగా కాగా మరికొన్ని భూములు రెండు సంవత్సరాలు కౌలు కాలం పూర్తయింది. రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారి ఈ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం భూముల పరిస్థితి, కౌలు ఏ విధంగా ఉన్నది ప్రైవేటు భూముల కౌలు ఏ విధంగా ఉన్నది స్థానిక అధికారులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ గుర్రం ప్రసాద్, దేవస్థానం కార్య నిర్వహణ అధికారులు ఎంవి రామయ్య, నాగజ్యోతి, సిబ్బంది అర్చకులు రైతులు తదితరులు పాల్గొన్నారు .


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్