మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలికల సంరక్షణ పై షార్ట్‌ ఫిల్మ్ పోటీలు

1 గంట క్రితం

Short film competitions on the protection of girls
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. కె. అనిత తెలిపారు. స్టాఫ్ సెక్స్ సెలక్షన్-సేవ్ ద గర్ల్ చైల్డ్ ' అనే అంశంపై పీసీపీఎన్‌డీటీ చట్టంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాకినాడలోని పీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఏఎస్‌డీ ఉమెన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీతో పాటు జగ్గంపేట, పిఠాపురం, ఏలేశ్వరం, కె.పి.పురం, తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు బాలికల సంరక్షణకు సంబంధించిన ఇతివృత్తంతో 10 నిమిషాల నిడివి గల షార్ట్‌ఫిల్మ్ రూపొందించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పంపించాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించనున్నట్లు డా. అనిత తెలిపారు. ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు చొప్పున అందజేయనున్నారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రాలను కూడా అందిస్తారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 11 న కాకినాడ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్