బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఫ్లషింగ్ ఆపరేషన్

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద బుధవారం ఇరిగేషన్ శాఖ అధికారులు ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహించారు. గోదావరి నదిలో పేరుకుపోయిన బురద, మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టారు. బ్యారేజ్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తూ నదిలో పేరుకుపోయిన వ్యర్థాలను దిగువకు పంపించే చర్యలు చేపట్టారు. ప్రతి రబీ సీజన్ ప్రారంభానికి ముందు, వరదలు తగ్గిన అనంతరం బ్యారేజ్ వద్ద ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఇరిగేషన్ శాఖ హెడ్‌వర్క్స్ డీఈ ఆనంద్ బాబు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా నదిలో పేరుకుపోయిన బురద, మట్టి తొలగి నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్వహణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్