సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

11 సెప్టెంబర్, 2026

Goods train derails in Kovvur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 10:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తూర్పు గోదావరి : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో నాలుగో లైన్‌ పై గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సీపట్నం, తుని, అన్నవరం, నిడదవోలు, రాజమండ్రి స్టేషన్లలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. ఇవాళ ఉదయం 9.15 గంటలకు కొవ్వూరు స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన వందేభారత్‌ రైలు నిలిచిపోయింది. విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రైళ్ల రాకపోకల ఆలస్యంపై ప్రయాణికులు గమనించి తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఆలస్యంగా నడుస్తున్న లేదా నిలిచిపోయిన రైళ్లు ..... అన్నవరం దగ్గర : ఉదయ్ ఎక్స్‌ప్రెస్, తుని దగ్గర : యలమంచెలి ఏసీ ఎక్స్‌ప్రెస్, నర్సీపట్నం రోడ్డు దగ్గర : ఉదయ్ ఎక్స్‌ప్రెస్, ఎలమంచిలిలో: సింహాద్రి ఎక్స్‌ప్రెస్, పట్టాలు తప్పిన గూడ్స్ బండి పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతుండటంతో, త్వరలోనే రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్