సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లాలోని పాఠశాలలకు 27, 28 తేదీల్లో సెలవులు

1 గంట క్రితం

eg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డిఇఒ వాసుదేవరావు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 27, 28 తేదీలలో (మంగళ, బుధవారాలు) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కంది వాసుదేవ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలోని ముఖ్యమైన రికార్డులు, సామగ్రి పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తుఫాన్ పునరావాస కేంద్రాలుగా (షెల్టర్లు) ఎంపిక చేసిన పాఠశాలల్లోని స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానెళ్లకు పక్కాగా రక్షణ ఏర్పాట్లు చేయాలని అన్నారు. తుపాన్ షెల్టర్లుగా గుర్తించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే సంబంధిత రెవెన్యూ, సహాయక సిబ్బందికి పాఠశాల తాళాలను అప్పగించాలన్నారు. తుపాన్ ప్రభావం తగ్గేంతవరకు విద్యార్థులెవరూ అనవసరంగా బయటకు రావద్దని, ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు (ఎంఇఒలు) ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలని డిఇఒ ఆ ప్రకటన లో తెలిపారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్