సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనసేనలోకి రామకృష్ణ

56 నిమిషాల క్రితం

జనసేనలోకి రామకృష్ణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 05:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : స్థానిక ఎన్నికల వేళ ఆలమూరు మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చొప్పెల్ల పిహెచ్.సి మాజీ చైర్మన్ ఆకుల రామకృష్ణ సోమవారం తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి బండారు శ్రీనివాసరావు సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ రాజకీయ సమీకరణాల కారణంగానే టిడిపి నుంచి జనసేనలో చేరానన్నారు. బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ..రామకృష్ణ లాంటి నేత జనసేనలో చేరడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు సురపురెడ్డి సత్య, సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, జనసేన నేతలు తోరాటి సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి మహేష్, సోము వీర్రాజు, సోము శ్రీను, దంగేటి బాపనయ్య, తదితరులు పాల్గొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్