సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపానుపై అప్రమత్తంగా ఉండాలి : ఎంపిడిఒ జి.భవాని

1 గంట క్రితం

తుపానుపై అప్రమత్తంగా ఉండాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మామిడికుదురు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుపాను తీవ్రత దృష్ట్యా మండల ప్రజలు, వివిధ శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఒ జి.భవాని, తహశీల్దార్ సిఎస్ రాజు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తుపాను ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులతో వారు అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

తుపాను ప్రభావం తగ్గి, వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మండల పరిధిలోని గర్భిణీలు, బాలింతల వివరాలను తక్షణమే సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో వారి రక్షణకు అవసరమైన ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయాలని వైద్య, అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించారు. తుపాను వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్