సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Arnab Effect: 27, 28వ తేదీల్లో పాఠశాలలకు సెలవులు

1 గంట క్రితం

schools
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 05:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: అర్నాబ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీలోని వివిధ జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కాకినాడ, విజయనగరం జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు రేపు, ఎల్లుండి సెలవులు ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు తెరిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. రేపు కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్