శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు రైతుల ధాన్యం కొనుగోలుకు ఒడిస్సా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

1 గంట క్రితం

Purandeswari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 04:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒడిశా అధికారులతో మాట్లాడిన ఎంపి పురంధేశ్వరి

ప్రజాశక్తి-అనపర్తి : ఒడిస్సా రాష్ట్రంలో వరిసాగు చేస్తున్న సుమారు 50 వేల మంది తెలుగు రైతుల ధాన్యం కొనుగోలుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల అనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు ఒడిస్సాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ఒడిస్సా ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎంపీ పురందేశ్వరి ఒడిస్సా వ్యవసాయ శాఖ మంత్రి, పలువురు మంత్రులద్వారా మాట్లాడి ధాన్యం కొనుగోలు అంశాన్ని వివరించారు. దీంతో ఒడిస్సా ప్రభుత్వం తెలుగు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఎపి రైతులకు ఊరట లభించింది. సమస్య పరిష్కారానికి సహకరించిన ఎంపీ పురందేశ్వరి, ఒడిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, అక్కడి మంత్రులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్