ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, పౌరుల సంతృప్తిని మెరుగుపరిచే దిశగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 18 అర్జీలు రాగా వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 4, రెవెన్యూకి సంబంధించి 1, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 5, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 3, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 1, వార్డు సచివాలయాలకు సంబంధించి 4 ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలను నిబంధనలకు లోబడుతూనే మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. వివిధ రకాల సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిశీలించి పరిష్కరిస్తేనే.. అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు. ఏ అర్జీ కూడా ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, రెవిన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా సమస్యల పరిష్కారం : అదనపు కమిషనర్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)