బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సహకార రంగంలో ఊనగట్ల సొసైటీ కి రాష్ట్ర స్థాయి గుర్తింపు

48 నిమిషాల క్రితం

State-level recognition for Unagatla Society in the cooperative sector.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : 63వ అపకోబు ఫార్మషన్  డే  సందర్భంగా ... బుధవారం విజయవాడ గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఊనగట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి "ఉత్తమ ప్రతిభా పురస్కారం" లభించింది. కొవ్వూరు నియోజకవర్గ నాయకులు పెండ్యాల  అచ్చిబాబు , శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు  ప్రోత్సాహంతో ఊనగట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాష్ట్ర స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో అపకోబు  చైర్మన్ గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా ఊనగట్ల సొసైటీ చైర్మన్ బొల్లిన శివ నాగేంద్ర ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సహకార రంగంలో సొసైటీ కనబరిచిన పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రంలోని వివిధ సహకార సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లిన శివ నాగేంద్ర  మాట్లాడుతూ .... ఈ గుర్తింపు ఒక్క వ్యక్తికి దక్కిన గౌరవం కాదని, ఊనగట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేసిన డైరెక్టర్ల బృందం, సిబ్బంది, సభ్య రైతులు, సహకరించిన ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి దక్కిన గుర్తింపని అన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇదే నిబద్ధతతో పనిచేస్తూ, సహకార రంగంలో ఊనగట్ల సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్