ప్రజాశక్తి గోపాలపురం (తూర్పు గోదావరి) : పొగాకు కొనుగోలు ధరలు మార్కెట్లో జోరందుకున్నాయి. ప్రస్తుతం నాణ్యమైన పొగాకు కిలోకు 345 లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వేలం నిర్వహణ అధికారి బి శ్రీహరి మాట్లాడుతూ .... గోపాలపురం వేలంకేంద్రంకు పొగాకు కొనుగోలు కేంద్రంకు 1167 బేళ్ళు తీసుకురాగా అందులో 859 బేళ్ళు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 138 నోబిడ్ అయినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభానికి ముగింపుకు ధర స్వల్పంగా వ్యత్యాసం ఉండడంతో అమ్మకాలు జరిపిన 137 బేళ్ళను (ఆర్ఆర్) రైతులు రిజెక్షన్ చేసినట్లు తెలిపారు. ఒక కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి 125 రోజుకు చేరుకుందన్నారు. ప్రస్తుతం లో గ్రేడ్ ధర 150 ఉన్నట్లు ఆయన తెలిపారు. సరాసరి ధర 302.97 లభించిందన్నారు. 2025-26 కాలానికి సంబంధించి 9.8 మిలియన్ కేజీలు అనుమతులు ఇవ్వగా... రైతులు 15 మిలియన్ కేజీలు పొగాకు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గోపాలపురం వేలం కేంద్రంలో ఐదు మిలియన్ కేజీలు పొగాకు కొనుగోలు జరిపినట్లు వివరించారు.
ఆశాజనకంగా పొగాకు ధరలు - రైతన్నల హర్షం ...
ప్రారంభంలో నాణ్యమైన పొగాకు ఒక కిలో కు ధర 265 తో ప్రారంభం కాగా అనేక రోజులపాటు పొగాకు కొనుగోలు ధరలు పెరగకుండా ఎటువంటి మార్పులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. తీవ్ర నిరుత్సాహపడ్డారు. దీంతో అత్యధిక మంది రైతులు పొగాకు కొనుగోలు జరపలేదు. సన్న చిన్న కారు రైతులు మాత్రం అప్పులు చేసిన చోట ఒత్తిళ్ళు తాళలేక తక్కువ ధరకే అమ్మకాలు జరిపారు. దీనిపై గత నెలలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి వేలం కేంద్రంకు వచ్చి రైతులకు గిట్టుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులు గట్టిపట్టు పట్టారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో పొగాకు కంపెనీలు వ్యాపారులు దిగొచ్చి కొనుగోళ్లు వేగం పెంచారు. ఇప్పటికి నాలుగుసార్లు ధరలు పెరిగాయి. ప్రారంభంలో 265 ఉండగా తరువాత పెరిగిన ధరలు 275, 315, 325 , 345 కు చేరింది. పొగాకు ధరలు పెరగడం పట్ల బోర్డు రైతు సంఘం అధ్యక్షులు ఇల్లూరి రాంబాబు ఫోర్ కమిటీ మెంబర్ ప్రత్తిపాటి సత్యనారాయణ, రైతులు కొర్లపాటి అన్నవరం, పరిమి జగదీష్ పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. పొగాకు సాగుకు పెట్టుబడి భారీగా పెరిగాయని తెలిపారు. పొగాకు రైతులు నష్టపోకుండా నాణ్యమైన పొగాకు, లో గ్రేడు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరారు.








కామెంట్‌లు (0)