ప్రజాశక్తి-అనపర్తి
స్థానిక కర్రి అప్పారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బాలబాలికల హక్కులు, వాటి రక్షణకు ఉన్న చట్టాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. జూనియర్ సివిల్ జడ్జి, చైర్మన్ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు చట్టాలపై అవగాహన ఉండటం వల్ల సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని సూచించారు. బాల్యంలోనే మంచి విలువలను అలవర్చుకోవాలని, తోటివారిపై మానవీయ కోణంలో నడుచుకుంటూ ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బార్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ రమణమూర్తి, లాయర్ లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ బాలబాలికల హక్కులు, వాటి రక్షణకు ఉన్న చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, న్యాయస్థాన ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)