ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని చొప్పెల్లలో కాపు కళ్యాణ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి కూటమి నాయకులు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హాజరైన ఆలమూరు డిసి చైర్మన్ మెర్ల గోపాలస్వామి మాట్లాడుతూ.. ఈ కళ్యాణ మండపం ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 16 లక్షలతో ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేసినట్లు తెలిపారు. ముందుగా మండల పరిషత్ నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దీంతో భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అన్ని విధాల సహకరిస్తున్న స్థానిక కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఈ సందర్భంగా స్థానిక కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.
కాపు కళ్యాణ మండపం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)