క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి నారాయణ,ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్..
ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతిలోని ఉద్దండరాయనిపాలెం వద్ద క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్స్ కు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి నారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. ట్విన్ టవర్స్ నిర్మాణం పూర్తయితే 25 వేల మంది పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం 37,48,847 చ. అ. విస్తీర్ణంలో T1,T2 టవర్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ, రీసెర్చ్, ఆవిష్కరణలు, రెడీ టు ఫ్యూచర్ వర్క్ స్పేస్ లు ట్విన్ టవర్స్ లో ఏర్పాటవుతున్నాయన్నారు. 50 ఎకరాల క్వాంటం వ్యాలీ లోని 11 ఎకరాల్లో రెండు టవర్స్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. మొత్తం క్వాoటం వ్యాలీలో 8 టవర్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. బహుళ ఆప్షన్లు ఒకేసారి తీసుకుని పనిచేయటమే క్వాoటం కంప్యూటర్ ప్రత్యేకతని, రక్షణ, వైద్య, బ్యాంకింగ్, ప్రకృతి వైపరీత్యాల్లో నష్ట నివారణ రంగాల్లో వీటి పాత్ర ఎంతో కీలకమన్నారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతో అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ కార్పొరేషన్ ఇంజనీర్లు, రైతులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)