న్యూఢిల్లీ : యుపిఐ చెల్లింపులపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్ )చార్జీలను దీపావళి తర్వాత నుండి అమలు చేయనున్నట్లు యుపిఐ, సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పండుగ సీజన్ దృష్ట్యా ఈనిర్ణయాన్ని వాయిదా వేశామని, ఎప్పటి నుండి అమలు చేయనున్నది తర్వాత ప్రకటిస్తామని ఎన్‌పిసిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. యుపిఐ చెల్లింపులపై విధించిన ఎండిఆర్ చార్జీలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న, మధ్యతరహా వ్యాపారులపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుపిఐ చెల్లింపులపై ఎండిఆర్ చార్జీలను ఎన్‌పిసిఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2వేలకు పైగా చెల్లింపులకు 0.4శాతం చార్జీ వర్తిస్తుందని తెలిపింది.








కామెంట్‌లు (0)