మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోనసీమ జెడ్పీ చైర్మన్ రేసులో కప్పల సునీల్ కుమార్

1 గంట క్రితం

alamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 03:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రామచంద్రాపురం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు

ప్రజాశక్తి - ఆలమూరు : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ తొలి చైర్మన్ రేసులో రామచంద్రాపురం 13వ అదనపు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కప్పల సునీల్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పదవి జనరల్ కు కేటాయిస్తారని భావించి చాలామంది కూటమి పార్టీలకు చెందిన కాపు నాయకులు పోటీపడ్డారు. అయితే ఎస్సీ జనరల్‌ కు రిజర్వ్ కావడంతో సునీల్ పేరు తెరపైకి వచ్చింది. ఆలమూరుకు చెందిన ఈయన న్యాయవాది వృత్తిలో అతి తక్కువ సమయంలోనే విశేష గుర్తింపు పొందారు. గోదావరి మధ్యలో వరదల సమయంలో ఒక ప్రత్యేక ద్వీపంగా కనబడే ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన సునీల్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆర్థికంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అనేక మంది ప్రముఖ న్యాయవాదులు వద్ద శిక్షణ పొంది ఆ వృత్తిలో పటిష్టమైన అవగాహన తెచ్చుకున్నారు.

ఆలమూరు కోర్టులో దశాబ్ద కాలంగా తిరిగి లేని ఆధిపత్యాన్ని సాధిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వంలో రామచంద్రపురం 13వ అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధ్యతలు చేపట్టి విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆగష్టు 15 న ఉత్తమ సేవా పురస్కారాన్ని కూడా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. చిన్న వయసులో ఆలమూరు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా సునీల్ ఎన్నికై అందరి మన్ననలు పొందారు.

తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగంలో సునీల్ కీలకంగా ఉన్నారు. పదిహేను సంవత్సరాల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పదవి చేపట్టారు. గత సార్వత్రిక ఎన్నికలలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ త్రి మెన్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. ఇటీవల జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాద్యతలు చేపట్టారు. ప్రజల పక్షాన నిలిచే సునీల్ జెడ్పీ చైర్మన్ గా ఉంటే కూటమి ప్రభుత్వానికి కూడా మంచి గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్