ప్రజాశక్తి - చాగల్లు
ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో జరిగిన అండర్ 17 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలలో చాగల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటుకుని ద్వితీయ స్థానంలో నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తరఫున పాల్గొన్న 18 మంది జట్టులో ఏడుగురు చాగల్లు జెడ్పీ హెచ్ఎస్ చాగల్లు విద్యార్థులు కావడం విశేషమని పీడీ జె.విజయలక్ష్మి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జట్టుకు చాగల్లు విద్యార్థిని జి. బేబీ లావణ్య కెప్టెన్ గా వ్యవహరించారని అన్నారు. విజేతలను హెచ్ఎం ఎస్.వాసవి, ఉపాధ్యాయులు అభినందించారు.








కామెంట్లు (0)