ప్రజాశక్తి-దేవరపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైన తరుణంలో దేవరపల్లి మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య(27) గుండెపోటుతో మృతి చెందారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తయి, శనివారం ఓట్ల లెక్కింపు జరగనున్న వేళ అభ్యర్థి మరణించడంతో దుమంతునిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఆమెకు గ్యాస్ నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించిన అనంతరం నొప్పి తగ్గడంతో ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే, శుక్రవారం ఉదయం ఆమె మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.దివ్యకు నాలుగేళ్ల కుమారుడు, మూడు నెలల వయసున్న పసిబాబు ఉన్నారు. పార్టీలకతీతంగా పలువురు రాజకీయ నేతలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.







కామెంట్‌లు (0)