ప్రజాశక్తి - పెరవలి
మండల పరిధిలోని కొత్తపల్లి అగ్రహారం గ్రామంలో సోమవారం తహశీల్దార్ కే. నిరంజన్ ఆధ్వర్యంలో గ్రామసభను అత్యంత విజయవంతంగా నిర్వహించారు.ఈ గ్రామసభలో తహశీల్దార్ కె.నిరంజన్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారిక ముద్రతో కూడిన 670 నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే రైతులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఆయకట్టు పరిధిలోని రైతులందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలోని భూ సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ సేవల లభ్యతకు ఇలాంటి గ్రామసభలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సీహెచ్. వెంకటరమణ, డీటీ సన్నీ బాబు, ముమ్మిడివరం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అభిశెట్టి సత్తిరాజు, బర్రె దొరస్వామి, బండారు సత్యం (బాబి), పంచాయతీ సెక్రెటరీ దిలీప్ కుమార్, వీఆర్ఓ సుబ్బారావులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)