mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ చైతన్య లో ఘనంగా యోగా దినోత్సవం

5 గంటల క్రితం

Yoga Day Celebrated Grandly at Sri Chaitanya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మండపేట (తూర్పు గోదావరి) : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్‌లో విద్యార్థులకు శనివారం ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా ప్రాముఖ్యత, యోగాసనాల రకాలు, యోగా చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో వివిధ యోగాసనాలను చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజినల్ ఇన్‌చార్జ్ నరేష్ మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా మనశ్శాంతి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజూ యోగా అభ్యసించడం ద్వారా విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్