మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

42.775 కిలోల గంజాయి స్వాధీనం

1 గంట క్రితం

42.775 kg of ganja seized
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రెండు కార్లు పట్టివేత.. ఒకరి అరెస్టు, నలుగురు పరారీ


ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆశ్రం ఆసుపత్రి నుంచి ఏలూరు వైపు వెళ్లే రహదారిలోని జీ 3 రెస్టారెంట్‌ సమీపంలో సోమవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను గమనించి వాహనాలను వదిలి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిలో పుత్తూరు సాయి మంజునాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, షాహుల్‌ హమీద్‌తో పాటు మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడిన రెండు కార్లను తనిఖీ చేయగా వాటి డిక్కీల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తహశీల్దార్‌ విజయకుమార్‌, ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో చట్టపరమైన ప్రక్రియ నిర్వహించి మొత్తం 42.775 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మారుతీ స్విఫ్ట్‌, టాటా ఇండికా విస్టా కార్లు, ఒక ఒప్పో మొబైల్‌ ఫోన్‌, నిందితులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.21 లక్షలుగా నమోదు చేశారు. పుత్తూరు సాయి మంజునాథ్‌ను అదే రోజు సాయంత్రం అరెస్టు చేశారు. కేరళకు చెందిన షాహుల్‌ హమీద్‌తో పాటు పరారైన మరో ముగ్గురిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఉప పరిశీలకుడు వి.వెంకటేశ్వరరావు, సహాయక ఉప పరిశీలకుడు దారపు పూర్ణచంద్రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసు దర్యాప్తును ఏలూరు ఒకటో పట్టణ సీఐ కె.రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.
42.775 kg of ganja seized



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్